Header Banner

ఏపీలో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం! వాతావరణ శాఖ అలర్ట్!

  Sat Apr 05, 2025 10:36        Others

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా- ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినట్టయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసిందా సంస్థ. సోమవారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది. ఆదివారం కాకినాడలో ఓ మోస్తారు వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!


సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య రాయచోటి, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. కృష్ణా జిల్లా పెదవుటపల్లిలో 68.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2, ఎర్రగొండపాలెంలో 62 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మిగిలిన 18 ప్రాంతాల్లో 20 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. గురువారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 23 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విజ్ఞప్తి చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #HeavyRainfall #WeatherAlert #IMDAlert #RainUpdate